ఆమనగల్లులో బోనాల ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు

ఆమనగల్లులో బోనాల ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు

 

కడ్తల్ :ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలో రేపటి నుంచి జరగనున్న బోనాల ఉత్సవాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ పత్య నాయక్ ఆధ్వర్యంలో బోనాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు. కౌన్సిలర్లు మొక్తల వెంకటయ్య, ఏనుముల రమేష్‌, మహేష్‌, అనుష శ్రీశైలం, కోఆప్షన్‌ సభ్యుడు ఖాదర్‌, మున్సిపల్‌ సిబ్బంది, స్థానిక నాయకులు తో కలిసి ఉత్సవాలు జరిగే ప్రాంతాలను పరిశీలించి ఏర్పాట్లపై చర్చించారు. బోనాల సందర్భంగా ఆలయాల వద్దకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని చైర్మన్‌ పత్య నాయక్ సూచించారు. ఆలయాల పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సౌకర్యం, విద్యుత్‌ దీపాల ఏర్పాటు, రోడ్ల శుభ్రత తదితర పనులను వేగవంతం చేయాలని మున్సిపల్‌ సిబ్బందికి సూచించారు. భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజాప్రతినిధులు, మున్సిపల్‌ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని చైర్మన్‌ పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా పట్టణ ప్రజలు సహకరించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆయన కోరారు. భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్‌ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Views: 104

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మత్తు పదార్థాల జోలికి వెళ్తే బంగారు భవిష్యత్తు చిత్తు: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్  మత్తు పదార్థాల జోలికి వెళ్తే బంగారు భవిష్యత్తు చిత్తు: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ 
హైదరాబాద్: మత్తు పదార్థాల వినియోగానికి యువత దూరంగా ఉండాలని బీఆర్‌ఎస్‌ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల వినియోగంలో 25 ఏళ్లలోపు యువత...
శేషమ్మ దశదిన కర్మకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు 
దాకూరి గాలయ్య 35వ  వర్ధంతి  ఘన నివాళి-  
స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణి చేసిన సొసైటీ చైర్మన్ : ఎర్రబెల్లి రఘుపతి రావు 
పాలమూరు మహేందర్ ను అకారణంగా కొట్టిన తిమ్మాజిపేట్ ఎస్సై
సిరిపురం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
రక్తదానంతో తలసేమియా బాధితులకు పునర్జన్మ