హుస్నాబాద్ పట్టణంలో జోరుగా బెల్లం దందా
- హుస్నాబాద్ పట్టణంలో జోరుగా బెల్లం దందా
- బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ , పచ్చిమట్ల రవీందర్ గౌడ్
హుస్నాబాద్ :సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పలు కిరాణా షాపులలో ఎటువంటి బెల్లం కొనుగోలుకు సంబంధించి బిల్లులు లేకుండా కరీంనగర్ నుండి ఆటోలలో హుస్నాబాద్ కు తీసుకుని వస్తూ ముఖ్యంగా స్టేషన్ జనగాం వెళ్లే రహదారి బస్సులలో గుట్టు చప్పుడు కాకుండా గుడుంబా వ్యాపారం చేసుకునే వారికి తరలిస్తున్నారని బిఎస్పి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ ఆరోపించారు.ఇట్టి అమ్మకాలకు సంబంధించి హుస్నాబాద్ ఎక్సైజ్ శాఖ ఒకే కిరాణం షాపుపై బిల్లులు ఉన్న పలుమార్లు కేసులు నమోదు చేసినట్లు ఆరోపించారు.మరి పట్టణంలో దాదాపు 12 కిరాణం షాపులలొ ఈ అక్రమ దందా నడుస్తున్న ఎందుకు తనిఖీలు చేయడం లేదని బిఎస్పి పార్టీ పక్షాన ప్రశ్నించారు. ఎక్కడ కొనుగోలు చేశారు తదితర ఇన్వాయిస్ బిల్లులు లేని షాపులపై కేసులు ఎందుకు నమోదు చేయట్లేదన్నారు.ఒకవైపు హుస్నాబాద్ నియోజకవర్గంలో గుడుంబా ,మత్తుపదార్థాలు ఏరులై పారుతున్నాయి అని ప్రజలు వాపోతున్నారని,ఈ అక్రమ దందా చేస్తున్న పలు షాపులలో,వారి యొక్క గోదాములలో తనిఖీలు నిర్వహించి ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకోవాలని బిఎస్పీ పార్టీ పక్షాన కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


