శేషమ్మ దశదిన కర్మకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు
హైదరాబాద్: మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి మాతృమూర్తి శేషమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరయ్యారు. జూబ్లీహిల్స్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి శేషమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శేషమ్మ కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శేషమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు జైవీర్ రెడ్డి, రాజేష్ రెడ్డి, నాగరాజు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కోటింరెడ్డి వినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారు కూడా శేషమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కాసు కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలువురు ప్రజాప్రతినిధులు కార్యక్రమానికి హాజరై శేషమ్మకు పుష్పాంజలి ఘటించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


