ప్రభుత్వ కళాశాల లో నోటు పుస్తకాలు, బ్యాగ్ ల పంపిణీ

 హాజరైన జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవిందరామ్ 

ప్రభుత్వ కళాశాల లో నోటు పుస్తకాలు, బ్యాగ్ ల పంపిణీ

సంగారెడ్డి, :జిన్నారం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి గోవిందరామ్  ఆకస్మిక తనిఖీకి చేశారు  అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ రికార్డ్స్ ,విద్యార్థుల హాజరు శాతం ,అంతర్గత పరీక్షలు, ప్రాక్టికల్స్ నిర్వహణ తనిఖీ చేశారు, జూనియర్ కళాశాల విద్యార్థుల చదువు తీరు బాగా ఉందని పరీక్షల్లో ఉత్తీర్ణశాతం చానా బాగా ఉందని ఆయన కొనియాడారు. కళాశాల ప్రిన్సిపల్, చొరవతో విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదుగుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసిన నోటు పుస్తకాలు  బ్యాగ్ లను ఆయన చేతిలో మీదుగా  అందజేశారు. విద్యాసామాగ్రిని సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించి,జీవితానికి బంగారు బాటలు వేసుకోవాలని ఇంటర్మీడియట్ విద్యాధికారి, విద్యార్థులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

Views: 15

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మత్తు పదార్థాల జోలికి వెళ్తే బంగారు భవిష్యత్తు చిత్తు: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్  మత్తు పదార్థాల జోలికి వెళ్తే బంగారు భవిష్యత్తు చిత్తు: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ 
హైదరాబాద్: మత్తు పదార్థాల వినియోగానికి యువత దూరంగా ఉండాలని బీఆర్‌ఎస్‌ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల వినియోగంలో 25 ఏళ్లలోపు యువత...
శేషమ్మ దశదిన కర్మకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు 
దాకూరి గాలయ్య 35వ  వర్ధంతి  ఘన నివాళి-  
స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణి చేసిన సొసైటీ చైర్మన్ : ఎర్రబెల్లి రఘుపతి రావు 
పాలమూరు మహేందర్ ను అకారణంగా కొట్టిన తిమ్మాజిపేట్ ఎస్సై
సిరిపురం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
రక్తదానంతో తలసేమియా బాధితులకు పునర్జన్మ