మురుగు నీటితో దోమల బెడద.. పట్టించుకోని అధికారులు

మురుగు నీటితో దోమల బెడద.. పట్టించుకోని అధికారులు

మిడ్జిల్,: మిడ్జిల్ మండల కేంద్ర పరిధి మల్లాపూర్: గ్రామంలోని పలు ప్రాంతాల్లో మురుగు నీరు నిలిచిపోవడంతో దోమల బెడద తీవ్రంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల మధ్యలోనే మురుగు నీరు నిలిచి ఉండటంతో పరిసరాలు అపరిశు భ్రంగా మారుతున్నాయని వారు చెబుతున్నారు మురుగు నీరు, చెత్త పేరుకుపోవడంతో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ గ్రామ పంచాయతీ పాలకవర్గం, సంబంధిత అధికారులు సమస్య పరిష్కారంపై తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిలిచిన మురుగు నీటిని తొలగించి, డ్రైనేజీలను శుభ్రం చేయడంతో పాటు దోమల నివారణకు ఫాగింగ్‌, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతు న్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని మల్లాపూర్ గ్రామ సర్పంచ్‌, పంచాయతీ అధికారులు స్పందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

జిలుగుమాడులో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జిలుగుమాడులో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
మున్సిపాలిటీ పరిధిలోని జిలుగుమాడు గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ...
పాఠశాలకు సౌండ్ సిస్టం అందజేసిన పూర్వ విద్యార్థి
ఎంక్వయిరీ లేకుండానే మెమోలు...
గురువారం గ్రామ, వార్డు సభలు
హైవేపై మృత్యుఘోష..
దర్యాపూర్‌లో ఘనంగా వనమహోత్సవం
మురుగు నీటితో దోమల బెడద.. పట్టించుకోని అధికారులు