స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణి చేసిన సొసైటీ చైర్మన్ : ఎర్రబెల్లి రఘుపతి రావు 

స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణి చేసిన సొసైటీ చైర్మన్ : ఎర్రబెల్లి రఘుపతి రావు 

వరంగల్( నల్లబెల్లి ) నర్సంపేట శాసనసభ్యులు దొంతిమాధవ రెడ్డి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులు లేంకాల పెళ్లి, నల్లబెల్లి, గోవిందాపురం, కన్నరావపేట, బుచ్చిరెడ్డి పల్లె, గ్రామ పంచాయతీలలో పంపిణీ చేసిన నల్లబెల్లి మండల పాక్స్ చైర్మన్ ఎర్రబెల్లి రఘుపతిరావుఈ సందర్భంగా రఘుపతిరావు, మాట్లాడుతూ భారతదేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీకి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం. గతంలో రేషన్ షాపులో వేలిముద్రలు రాక ఓటీపీల ఇబ్బంది ఏర్పడేది అలాంటి ఇబ్బందులు లేకుండా స్మార్ట్ రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది పేదప్రజలందరికీ రేషన్ కార్డులు అందుతున్నాయని తెలియజేశారు. రేషన్ కార్డ్ లబ్ధిదారులందరికీ సన్న బియ్యం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నల్లబెల్లి పాక్స్ డైరెక్టర్లు చార్ల శివారెడ్డి, జిల్లా మునేందర్, బత్తిని మల్లయ్య, కొండాయిలపల్లె సర్పంచ్ ఎరుకలి స్వప్న నరేష్, బుచ్చిరెడ్డి పల్లె సర్పంచ్ భూక్య భద్రమ్మ బౌసింగ్, మండల ఆర్ ఐ కృష్ణ స్వామి,ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, జిపిఓ లు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్దూరి తిరుపతిరావు, మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గద్దల సురేష్, నల్లబెల్లి వర్డ్ మెంబర్ మాసంపెళ్లి అఖిల్, గ్రామ పార్టీ అధ్యక్షులు మామిండ్ల ఐలయ్య, కొనకటి ప్రతాప్, మైనుద్దీన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వైనాల వీరస్వామి,బిక్షపతి, సోమశేఖర్ రెడ్డి, ప్రభాకర్, సురేష్, ముత్యంరావు, రవీందర్ రావు, అన్వేష్, ప్రతాప్, హరీష్, సాంబయ్య, రామకృష్ణ, రేషన్ కార్డు లబ్ధిదారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Views: 43

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మత్తు పదార్థాల జోలికి వెళ్తే బంగారు భవిష్యత్తు చిత్తు: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్  మత్తు పదార్థాల జోలికి వెళ్తే బంగారు భవిష్యత్తు చిత్తు: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ 
హైదరాబాద్: మత్తు పదార్థాల వినియోగానికి యువత దూరంగా ఉండాలని బీఆర్‌ఎస్‌ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల వినియోగంలో 25 ఏళ్లలోపు యువత...
శేషమ్మ దశదిన కర్మకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు 
దాకూరి గాలయ్య 35వ  వర్ధంతి  ఘన నివాళి-  
స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణి చేసిన సొసైటీ చైర్మన్ : ఎర్రబెల్లి రఘుపతి రావు 
పాలమూరు మహేందర్ ను అకారణంగా కొట్టిన తిమ్మాజిపేట్ ఎస్సై
సిరిపురం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
రక్తదానంతో తలసేమియా బాధితులకు పునర్జన్మ