గుండ్లపహాడ్‌లో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక

గుండ్లపహాడ్‌లో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక

నల్లబెల్లి, (వరంగల్ జిల్లా): మండలంలోని గుండ్లపహాడ్ గ్రామంలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు. నల్లబెల్లి మండల మాజీ అధ్యక్షులు పరికిరత్నం మాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా వరంగల్ జిల్లా ఇన్‌చార్జి వంగూరి ఆనందరావు మాదిగ, నల్లబెల్లి మండల ఇన్‌చార్జి ఈసంపల్లి రాజు మాదిగ పాల్గొన్నారు. గ్రామ ఎమ్మార్పీఎస్ కమిటీ అధ్యక్షుడిగా పాక మధు మాదిగ, అధికార ప్రతినిధిగా కల్లేపల్లి చిరంజీవి మాదిగ, ప్రధాన కార్యదర్శిగా బొచ్చు రాజు మాదిగ, ఉపాధ్యక్షుడిగా గన్నారపు రవి మాదిగ, ప్రచార కార్యదర్శిగా కల్లపల్లి రాకేష్ మాదిగలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి వంగూరి ఆనందరావు మాదిగ మాట్లాడుతూ. గ్రామాల్లోని యువత ఉన్నత చదువులు చదువుకుని రాజ్యాంగం కల్పించిన హక్కులు, ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మధ్యలో చదువు ఆపేసిన విద్యార్థులు తిరిగి చదువును కొనసాగించాలని కోరారు. మనకు లభించిన 9 శాతం రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధిస్తే కుటుంబాల ఆర్థిక, సామాజిక పరిస్థితులు మెరుగుపడతాయని అన్నారు.అనంతరం పరికిరత్నం మాదిగ మాట్లాడుతూ ఈ నెల 31న నల్లబెల్లి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. మండలంలోని మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

హమీలు విస్మరించిన మంత్రి జూపల్లి: హమీలు విస్మరించిన మంత్రి జూపల్లి:
  కొల్లాపూర్ ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం   బీజేపీ వనపర్తి జిల్లా బీసీ జనరల్ సెక్రటరీ మేకల చెన్నయ్య యాదవ్ తీవ్ర ధ్వజం
స్వామివారి సేవలో టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా
90 శాతం ప్రజలకు చైతన్యం కలిగించడమే జేఏసీ లక్ష్యం 
నిర్మల్ స్వర్ణ రహదారిపై రోడ్డు ప్రమాదం: కారు - స్కూటీ ఢీ
పోచమ్మ ఆలయ నిర్మాణానికి ముస్లిం సోదరులే తొలి బీజం
బిజెపి సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు చింతల భూపాలను నియమించిన బిజెపి అధిష్టానం 
రెవ.జార్జ్ బి.గార్డెన్ దొర  34వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి చంద్రశేఖర్