నిర్మల్ స్వర్ణ రహదారిపై రోడ్డు ప్రమాదం: కారు - స్కూటీ ఢీ

సారంగాపూర్ : నిర్మల్ - స్వర్ణ ప్రధాన రహదారిపై ఉన్న రాధాస్వామి సత్సంగ్ ఆశ్రమం వద్ద బుధవారం ఎదురెదురుగా వచ్చిన కారు, స్కూటీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మహిళ  గాయపడ్డారు. స్థానికులు,  తెలిపిన వివరాల ప్రకారం... బోరిగాం గ్రామానికి చెందిన ఒక స్కూటీపై జామ్ గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు జామ్ వైపు వెళుతున్నారు. అదే సమయంలో ప్యారామూర్ గ్రామానికి చెందిన కారు బోరిగాం వైపు వస్తుండగా, రాధాస్వామి సత్సంగ్ ఆశ్రమం సమీపంలో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ​ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న జామ్ గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన మహిళలను చికిత్స నిమిత్తం 108 వాహనంలో నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు  దర్యాప్తు జరుపుతున్నారు.

Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News