వైభవంగా శ్రీ కోదండ రామాలయ భూమి పూజ
మల్యాల, : మల్యాల మండల కేంద్రంలో నూతనంగా నిర్మించతలపెట్టిన శ్రీ కోదండ రామాలయ మందిర నిర్మాణానికి బుధవారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో భూమి పూజ నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, పూర్ణకుంభ స్వాగతంతో ఈ పుణ్యకార్యాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరై, మల్యాల సర్పంచ్ బొట్ల జయప్రదతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ గ్రామంలో రాముడి మందిర నిర్మాణం జరగడం ఎంతో శుభపరిణామమని కొనియాడారు. ఆలయాలు సమాజంలో శాంతి, భక్తిభావాన్ని పెంపొందిస్తాయని, ఈ పవిత్ర కోదండ రామాలయ నిర్మాణానికి తన వంతుగా పూర్తి సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పరిసర గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


