జర్నలిస్టుల ఆపద్బాంధవుడు మంత్రి దామోదర్ రాజనర్సింహ
జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర నాయకులు యాదగిరి ముదిరాజ్
సంగారెడ్డి : అందోల్ నియోజకవర్గ సీనియర్ పాత్రికేయులు అల్లాదుర్గం భూమయ్య ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ తో అనారోగ్యానికి గురయ్యారు.ఈ విషయం సీనియర్ జర్నలిస్ట్ మునిపల్లి యాదగిరి మంత్రి దృష్టికి తీసుకెళ్లగా పొన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో అప్పటికప్పుడే స్పందించి హాస్పిటల్ కు చేరుకొని మెరుగైన వైద్య చికిత్స కోసం ఆస్పత్రి డాక్టర్ తో మాట్లాడారు.నాకు అత్యంత సన్నిహితుడు మెరుగైన వైద్యం చేయాలని సూచించారు. ఆస్పత్రిలో సీనియర్ పాతికేయలు భూమయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ, నేనున్నానని మంత్రి దామోదర్ రాజనర్సింహ భరోసానిచ్చారు. మెరుగైన వైద్యం చేయించిన మంత్రి దామోదర్ కు ఆందోల్ ప్రెస్ క్లబ్ జర్నలిస్ట్ లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.మంత్రి అల్లాదుర్గం భూమయ్య మెరుగైన వైద్య సేవలు అందడంతో ప్రస్తుతం కోలుకొంటున్నా విషయం మంత్రి కి తెలియజేయడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. మళ్లీ యధావిధి స్థానానికి రావాలని అన్నారు. మంత్రి చేసిన సహాయ సహకారాలువెలకట్టలేనివని యాదగిరి అన్నారు. మంత్రిసేవలు ఆందోల్ జర్నలిస్టు అందిస్తున్న సేవలను ఎల్లవేళలా గుర్తుంచుకుంటారని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర సోషల్ మీడియా ప్రచార కమిటీ సభ్యులు మునిపల్లి యాదగిరి అన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


