90 శాతం ప్రజలకు చైతన్యం కలిగించడమే జేఏసీ లక్ష్యం
సారంగాపూర్ : తెలంగాణ రాష్ట్రంలోని 90 శాతం మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు సామాజిక రాజకీయ చైతన్యాన్ని కలిగించడమే జేఏసీ లక్ష్యమని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు యాటకారి సాయన్న అన్నారు. బుధవారం మండల కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులకు విద్యావంతులకు అవగాహన సమావేశం నిర్వహించి, మండల కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ విశారదన్ మహరాజ్ నాయకత్వంలో బీసీ ఎస్సీ ఎస్టీలు సామాజికంగా చైతన్యం చేస్తున్నారని, ఈ పనిని గ్రామస్థాయి వరకు తీసుకువెళ్లే క్రమంలో కమిటీలు వేస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యా వైద్యం ఉపాధి బీసీల రిజర్వేషన్లు రక్షణ హక్కుల కోసం బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఒక గొప్ప పోరాటాన్ని ప్రారంభించబోతుందని, రానున్న కాలంలో 10 శాతం లేని అగ్రకులాల రాజ్యాన్ని కూలగొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర కమిటీ సభ్యులు రామగిరి రవీందర్, జిల్లా కార్యదర్శి కల్లూరు సుధాకర్,జిల్లా నాయకులు కుందూరు వినోద్,మేకల సింహం తదితరులు పాల్గొన్నారు.
మండల కమిటీ ఎన్నిక:
సారంగాపూర్ మండల కేంద్రంలో బుధవారం బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ మండల కమిటీని ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడుగా బొడిగెల రాహుల్, ఉపాధ్యక్షులుగా అల్లాడి నరసయ్య, దోకూర్ భీమలింగం, జాదవ్ సుధర్ సింగ్, జంగం సాయన్న, ప్రధాన కార్యదర్శిగా రాథోడ్ సంతోష్, కార్యదర్శిగా శ్రీ గాదె గోవర్ధన్, ముద్రం దినేష్, కండెల అంజయ్య, చాట్ల శ్రీధర్, సోషల్ మీడియా ఇన్చార్జిగా కుందూరు వినోద్, గౌరవ సలహాదారులుగా కండెల రాము,పిల్లి సంతోష్, మేకల సింహం, సర్పంచ్ కునేరు భూమన్న, సర్పంచ్ ఆడే అంబాజీ, సామల వీరన్న లను ఎన్నుకున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


