కడియం శ్రీహరిపై కౌశిక్‌రెడ్డి అనైతిక ప్రవర్తన..

ఆగస్టు 29న నైతికత కమిటీ భేటీ 

కడియం శ్రీహరిపై కౌశిక్‌రెడ్డి అనైతిక ప్రవర్తన..

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ నైతికత కమిటీ ఆగస్టు 29, 2026న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ భవనంలోని కమిటీ హాల్‌ నంబర్‌–1లో సమావేశం కానుంది. అసెంబ్లీ కార్యదర్శి తిరుపతి జారీ చేసిన లేఖ ప్రకారం.. మార్చి 29, 2026న జరిగిన శాసనసభ సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, సీనియర్ సభ్యుడు కడియం శ్రీహరిపై ప్రవర్తించిన తీరుకు సంబంధించిన అంశాన్ని కమిటీ పరిశీలించనుంది.ఈ వ్యవహారంపై విచారణ జరిపి, అవసరమైన తదుపరి చర్యలపై సిఫారసులు చేసేందుకు కమిటీ సమావేశం కానుంది. ఘటనకు సంబంధించిన వివరాలు, సభా ప్రవర్తనా నియమాలు, అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించే అవకాశం ఉంది. అనంతరం కమిటీ తన అభిప్రాయాలను, అవసరమైన చర్యలపై సిఫారసులను శాసనసభకు సమర్పించనుంది.కమిటీ చైర్మన్‌తో పాటు సభ్యులందరూ నిర్ణీత సమయానికి సమావేశానికి హాజరై తమ సహకారం అందించాలని శాసనసభ కార్యదర్శి కోరారు. ఈ సమావేశంతో కౌశిక్‌రెడ్డి వ్యవహారంపై అసెంబ్లీ నైతికత కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News