దాకూరి గాలయ్య 35వ వర్ధంతి ఘన నివాళి-
- జోగిపేటలో డాకూరి గాలయ్య 35వ వర్ధంతి ఘనంగా నిర్వహణ
- మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ప్రియ శిష్యుడు
- కాంగ్రెస్ కార్యాలయంలో చిత్రపటానికి నివాళులర్పించిన నాయకులు, కార్యకర్తలు
జోగిపేట, : మాజీ సర్పంచ్, నుండి ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు డాకూరి గాలయ్య 35వ వర్ధంతి వేడుకలు బుధ వారం జోగిపేట పట్టణ కేంద్రంలో ఘనంగా జరిగాయి. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో డాకూరి గాలయ్య మనుమడు, మాజీ కౌన్సిలర్ డాకూరి శివశంకర్, జోగిపేట మున్సిపల్ కౌన్సిలర్లు గడ్డి అరుణ్ కుమార్, కొషికె రాజశేఖర్, ఆత్మా కమిటీ డైరెక్టర్లు ఖాలేద్, చేనేత సంఘం డైరెక్టర్ చిట్యాల మధు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అల్లె యాదగిరి, మైనారిటీ సీనియర్ నాయకులు మోసిన్ భాయ్, కొత్త శ్రీనివాస్, రమేష్ గౌడ్, డాకూరి నాగరాజు, ఆకుల నందు, భాస్కర్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ."డాకూరి గాలయ్య అన్న కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక లాంటి వారు. సర్పంచ్ గా, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేశారు. ఆయన చూపిన మార్గం నేటి తరం కార్యకర్తలకు ఆదర్శం" అని అన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


