పాలమూరు మహేందర్ ను అకారణంగా కొట్టిన తిమ్మాజిపేట్ ఎస్సై
ఇద్దరూ కానిస్టేబుల్ లను విధుల నుండి తొలగించాలనీ - బిఎస్పీ డిమాండ్.
నాగర్ కర్నూల్ , తిమ్మాజీపేట : ఇ రోజు బహుజన సమాజ్ పార్టీ(బిఎస్పీ) ఆధ్వర్యంలో తిమ్మాజిపేట్ ఎస్సై చేతిలో దారుణంగా కొట్టబడి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడానికి వచ్చిన పాలమూరు మహేందర్ గారిని పరామర్శించడం జరిగింది. ఇ కార్యక్రమంలో బిఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్ మాట్లాడుతూ తిమ్మాజిపేట్ పోలీస్ స్టేషన్ లో జరిగిన అమానుష సంఘటనను బిఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. ఎంక్వయిరీ కోసం పిలిచిన బాధిత పాలమూరు నరేందర్ ను పోలీస్ స్టేషన్ లో తిమ్మాజిపేట్ ఎస్సై గారు తీవ్రంగా కొట్టడం హేయనీయం అన్నారు. అట్లాగే బాధితుడు చెప్తున్న దాని ప్రకారం నిన్న విధుల్లో ఉన్న ఒక కానిస్టేబుల్ మహేందర్ మెడల మీద కాలుపెడితే, ఎస్సై గారు మూత్ర విసర్జన చేయడం అమానుషం అన్నారు. ఇట్టి సంఘటనను బిఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఇ ఘటనకు కారణమైన తిమ్మాజిపేట్ ఎస్సై, ఇద్దరి కానిస్టేబుల్ లను తక్షణమే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ (MLC)ఇవ్వకుండా, మహేందర్ కుటుంబా నికి రక్షణ కల్పించకుండా ఉండటం సమంజసం కాదన్నారు. బాధిత మహేందర్ కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించాలని, పోలీస్ రక్షణ సమక్షంలో బాధితునికి ట్రీట్మెంట్ జరగాలని అన్నారు. బాధిత మహేందర్ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత జిల్లా ఎస్పీ గారి దృష్టికి ఇ విషయాన్ని తీసుకుని వెళ్తామని పేర్కొన్నారు. అప్పటిదాక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎంక్వయిరీ జరగాలని కోరారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్సీ గారి దృష్టిలో కూడా ఇ విషయం ఉంచినట్లు బాధితులు తెలిపారు. ఎమ్మెల్సీ గారు కూడా స్పందించి ఆ కుటుంబానికి అండగా నిలవాలన్నారు. బాధిత మహేందర్ తో పాటు పోలీస్ స్టేషన్ కి వెళ్లిన వారిని కూడా పోలీస్ స్టేషన్ ఆవరణలో మాజీ సర్పంచ్ వర్గం వాళ్ళు బెదిరించి, గొంతు పట్టుకోవడంపై మండిపడ్డారు. పోలీస్ స్టేషన్ ఆవరణలలో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృత్తం కాకుండా జిల్లా అధికారులు చూడాలని మాట్లాడారు. ఇ కార్యక్రమంలో పార్లమెంట్ ఇంచార్జ్ సి.కళ్యాణ్, జిల్లా ఈసీ మెంబర్ బాలస్వామి, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ హర్ష ముదిరాజ్, అసెంబ్లీ అధ్యక్షులు పరుశరామ్, అసెంబ్లీ కమిటీ కార్యదర్శి మధు, తిమ్మాజిపేట్ మండల అధ్యక్షులు శంకర్, తాడూర్ మండల అధ్యక్షులు ఆంజనేయులు, సెక్టార్ అధ్యక్షులు రాముడు, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


