రెవ.జార్జ్ బి.గార్డెన్ దొర  34వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి చంద్రశేఖర్ 

రెవ.జార్జ్ బి.గార్డెన్ దొర  34వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి చంద్రశేఖర్ 

జహీరాబాద్ :అల్లీపూర్ మెథడిస్ట్ చర్చిలో నిర్వహించిన దివంగత రెవ.జార్జ్ బి.గార్డెన్ దొర 34వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు డా. ఎ.చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని రెవ.జార్జ్ విగ్రహానికి పులా మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెవ.జార్జ్ బి.గార్డెన్ దొర సేవలను స్మరించుకుని,  జహీరాబాద్ ప్రాంతానికి వారు అందించిన సేవలు, సమాజానికి చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు  నరేష్ గౌడ్ , మాజీ పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు , కౌన్సిలర్ మహేష్ కుమార్ , సర్పంచ్ ప్రేమ్ రాథోడ్ గారు,కాంగ్రెస్ నాయకులు రామచందర్ , జైరాజ్ , శాంసన్ ,అరవింద్ , జనార్దన్  ,మొయిజ్ , గౌస్  తదితరులు పాల్గొన్నారు.

Views: 26

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News