కస్తూర్బా పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

 కస్తూర్బా పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

నాగర్ కర్నూల్/బిజినపల్లి : విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందుతుందా లేదా అని తెలుసుకునేందుకు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ మంగళవారం బిజినపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.పాఠశాలకు చేరుకున్న కలెక్టర్ ముందుగా విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి విద్యాబోధన తీరు, విద్యార్థుల అభ్యాస స్థాయిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అనుకూలమైన విద్యా వాతావరణం కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ప్రతిరోజూ వేడి వేడి భోజనం అందించాలని, నాణ్యత, పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ వద్దని స్పష్టం చేశారు.వంటగది, ఆహార పదార్థాల నిల్వ, పరిసరాల పరిశుభ్రతను కూడా కలెక్టర్ పరిశీలించారు. పాఠశాల ఆవరణ, వంటగది పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పాఠశాలలోని మౌలిక వసతులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.విద్య, వసతి, భోజన సదుపాయాలు సక్రమంగా అందేలా చూడాలని, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.ఈ తనిఖీలో తహసీల్దార్ మునీరుద్దీన్, ఎంపీడీవో కథలయ్యతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది కలెక్టర్ వెంట ఉన్నారు.
 
1003370120
 
 
Views: 61

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ ద్వారా ఎరువులు కొనుగోలులు రైతులకు శాపంగా మారాయి  కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ ద్వారా ఎరువులు కొనుగోలులు రైతులకు శాపంగా మారాయి 
చేగుంట : మెదక్ జిల్లా చేగుంట నుండి మెదక్ వెళ్లే హైవేలో రైతులు బైఠాయించి యూరియా యాప్ ను ఎత్తివేయాలి అని పొలంపల్లి చౌరస్తా లో  పొలంపల్లి...
మంజీరా నీటిపై చార్మినార్‌ బేవరేజెస్‌ దోపిడీ?
మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
లార్డ్ ఉదయ్ నాగరాజు తెలంగాణకు గర్వకారణం
500 మీటర్ల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ
హరే కృష్ణ కిచెన్‌లో పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలి: బల్దియా కమిషనర్ వెంకన్న
గంభీరావుపేట లో జాతీయ తిరంగా ర్యాలీ