సైబర్ నేరాల పట్ల యువతులు అప్రమత్తంగా ఉండాలి నాగర్ కర్నూలు ఎస్సై2 కృష్ణాజి

సైబర్ నేరాల పట్ల యువతులు అప్రమత్తంగా ఉండాలి నాగర్ కర్నూలు ఎస్సై2 కృష్ణాజి

నాగర్‌కర్నూల్,:నాగర్‌కర్నూల్‌ సాంఘిక సంక్షేమా బాలికల వసతి గృహంలో మంగళవారం సాయంత్రం సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం పోలీసులు నిర్వహించారు. ఈ కార్యక్రమునకు నాగర్‌ కర్నూల్ ఎస్సై 2 కృష్ణాజి ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాల విషయంలో యువతులు ప్రత్యేక అప్రమత్తతతో ఉండాలన్నారు.అదేవిధంగా ఆన్లైన్ మోసాలు, ఫేక్ కాల్స్, OTP మోసాలు, సోషల్ మీడియా హ్యాకింగ్, అశ్లీల సైట్లు, డబ్బు సంబంధిత సైబర్ నేరాల గురించి విద్యార్థినీలకు క్లుప్తంగా వివరించారు. వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా తెలియని లింకులు వస్తే ఆ లింకులను క్లిక్ చేయవద్దన్నారు.పోలీసులను, ఎవరైనా ఫోన్ చేసి మేము బ్యాంక్ బ్యాంకు సిబ్బందిమని, లేదా పోలీసులమని లేదా ఎవరైనా OTP, బ్యాంక్ వివరాలు, ఆధార్ నంబర్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని అడిగితే వారికి చెప్పవద్దని సూచించారు. యువత సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉంటూ మన తల్లిదండ్రులకు ఇరుగుపొరుగు వారికి కూడా సైబర్ నేరాల పైన అవగాహన కల్పించాలని కోరారు. ఒకవేళ అనుకోకుండా ఎవరైనా  సైబర్ నేరాలకు గురైతే భయపడకుండా వెంటనే 1930 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్‌కు గానీ పోలీసు సిబ్బందికి గానీ ఫిర్యాదు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది బాలస్వామి, రమేషు,చిన్న మరియు హాస్టల్ వార్డు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 
Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ ద్వారా ఎరువులు కొనుగోలులు రైతులకు శాపంగా మారాయి  కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ ద్వారా ఎరువులు కొనుగోలులు రైతులకు శాపంగా మారాయి 
చేగుంట : మెదక్ జిల్లా చేగుంట నుండి మెదక్ వెళ్లే హైవేలో రైతులు బైఠాయించి యూరియా యాప్ ను ఎత్తివేయాలి అని పొలంపల్లి చౌరస్తా లో  పొలంపల్లి...
మంజీరా నీటిపై చార్మినార్‌ బేవరేజెస్‌ దోపిడీ?
మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
లార్డ్ ఉదయ్ నాగరాజు తెలంగాణకు గర్వకారణం
500 మీటర్ల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ
హరే కృష్ణ కిచెన్‌లో పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలి: బల్దియా కమిషనర్ వెంకన్న
గంభీరావుపేట లో జాతీయ తిరంగా ర్యాలీ