WPL జాక్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.
హన్మకొండ. వరంగల్ ప్రైవేటు లెక్షరర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక ఆదివారం జరిగింది. అధ్యక్షుడు గా మల్యాల. వినోద్ కుమార్ , ఉపాధ్యక్షులుగా ఎం. సురేందర్ , ఎం. బుచ్చిరెడ్డి , బి. మహేందర్ , కె. అనిల్ కిషోర్ , ప్రధాన కార్యదర్శి బొల్లెన. లక్ష్మణ్ , కోశాధికారి పి. రవికుమార్., సహాయ కోశాధికారి మందపురం. సతీష్ , సహాయ కార్యదర్శులుగా సూర. రాజేందర్ , జి.ప్రవీణ్ కుమార్ , వి. శ్రీనివాస్ రెడ్డి ,చీఫ్ అడ్వైజర్లు గా ch. తిరుపతి రెడ్డి , k. అశోక్ , పి. విజేందర్ రెడ్డి , మరియు మిగతా కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు గా ఎన్నికైన మాల్యాల. వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రైవేట్ జూనియర్ కాలేజీ లెక్షరర్ల సంక్షేమం కోసం నా వంతు కృషి చేస్తానని, అలాగే ప్రైవేటు లెక్షరర్ల కు ప్రభుత్వం ఆరోగ్య భద్రత కల్పించాలని, తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించి ఆర్థిక భరోసా ఇవ్వాలని ఆయన అన్నారు. నూతన కార్యవర్గాన్ని జిల్లాలోని పలు కాలేజీల యాజమాన్యాలు, అధ్యాపకులు అభినందించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


