10 న బాలికలకు 5 కి. మి రోడ్డు స్పీడ్ సైక్లింగ్ పోటీలు
మహబూబ్నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ పిడి వేణు, నారాయణపేట్ జిల్లా స్కూల్ గేమ్స్ సెకరెటరీ శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు, నారాయణపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి . గోపాలం ఆధ్వర్యంలో ఈ నెల 10న శనివారం మక్తల్ ఎల్లమ్మ కుంట కొత్త కార్లపల్లి రోడ్డులో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థాయి14,17,19 సంవత్సరాల లోపు బాల బాలికలకు 5 కి.మీ రోడ్డు సైక్లింగ్ పోటీలు నిర్వహించి, క్రీడా ప్రతిభను చాటిన సైకిల్ రైడర్స్ ను ఎంపిక చేసి, ఈనెల చివరి వారంలో సిద్దిపేటలో జరుగు రాష్ట్ర స్థాయి సైకిలింగ్ పోటీలకు పంపుతామని, ఆసక్తిగల బాలబాలికలు బోనో ఫైడ్ ,ఆధార కార్డు ,టెన్త్ మేమో, రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు, స్వంత సైకిల్ తో, క్రీడా దుస్తులు ధరించి ఈ నెల 10న ఉదయం 9 గంటలకు పాల్గొన్నాలని బి.గోపాలం తెలిపారు. మిగతా వివరాలకు 77 02 71 3139 ను సంప్రదించగలరు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


