హనుమాన్‌బస్తీలో పేకాట స్థావరంపై దాడి
ఏడుగురు అరెస్ట్.. రూ.10,480 నగదు స్వాధీనం
బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్‌బస్తీలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం దాడి చేసి ఏడుగురిని అరెస్టు చేశారు. ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ దీకొండ రమేష్, సిబ్బంది దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా 52 పేకముక్కలు, రూ.10,480 నగదు, ఏడు సెల్‌ఫోన్లు, హీరో హోండా సీడీ-100 ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిని, స్వాధీనం చేసుకున్న సామగ్రిని తదుపరి చర్యల కోసం బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. అక్రమ పేకాట, జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


