హుస్నాబాద్ పట్టణ స్వర్గీయ శ్రీ జాన్ విల్సన్ ఆటో లోకల్ స్థాండ్ నూతన అధ్యక్షులుగా ఎండి ఫయాజ్
హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ స్వర్గీయ శ్రీ జాన్ విల్సన్(si )హుస్నాబాద్ ఆటో లోకల్ ఆటో స్టాండ్ నూతన అధ్యక్షులుగా మహమ్మద్ ఫయాజ్ ని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆటో యూనియన్ నాయకులు తెలిపారు. ఈ సందర్బంగా వైస్ ప్రెసిడెంట్ గా తాళ్లపల్లి రాజు గౌడ్, క్యాషియర్ గా తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ ని ఎన్నుకున్నారు. అనంతరం నూతన అధ్యక్షుడు ఫయాజ్ మాట్లాడుతూ ఆటో కార్మికుల సంక్షేమం కొరకు పనిచేస్తామని, ఆటో కార్మికుల ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈ శుభ సందర్బంగా ఆటో యూనియన్ నాయకులు మాటూరి ప్రేమ్ గౌడ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు డ్రైవర్లు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


