ఎండిన పంటలను పరిశీలించిన బి.ఆర్.ఎస్ నాయకులు మోరల్ శ్రీనివాసరావు.
- రైతులకు అండగా భారత రాష్ట్ర సమితి పార్టీ..
- రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో సిద్దాపూర్ రిజర్వాయర్ పూర్తిచేసి రైతులను ఆదుకోవడం జరుగుతుందని అన్నారు..
- సిద్దాపూర్, చింతల్ పేట్ గ్రామంలో సుమారు 200 ఎకరాలు వరి పంట ఎండిపోవడంతో ఆవేదనకు గురయ్యారు..
బాన్సువాడ నియోజకవర్గం లో సోమవారం నీళ్లు లేక ఎండిపోయిన వరి, సోయా బీన్ పంటల ను పరిశీలించిన భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు మోరల్ శ్రీనివాసరావు. బాన్సువాడ నియోజకవర్గం లోని వర్ని మండలం సిద్దాపూర్ గ్రామంలో సుమారు 200 ఎకరాల్లో వరి పంట ఎండి పోవడం తో భారత రాష్ట్ర సమితి నాయకులు రైతులకు అండగా ఉంటామ ని రైతుల సమస్యలను సంబంధిత అధికారుల కు దృష్టి కి తీసుకెళ్లడం జరుగుతుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా నాయకులు మోరల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ. వేసిన పంటల కు సరైన నీటి ఆధారం లేక ఎండిపోవడం తో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. పంట నష్టం తో ఆందోళన లో ఉన్న రైతులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. సంబంధిత అధికారులు స్పందించి నష్టపోయిన రైతులకు తగిన సహాయం అందేలా కృషి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దాపూర్ రిజర్వాయర్ కెసిఆర్ చొరవతో నే రాబోయే రోజుల్లో పూర్తి చేసి చింతల్ పెట్ట గ్రామ రైతుల ను ఆదుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంజిరెడ్డి భారత రాష్ట్ర సమితి నాయకులు రైతులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


