వెంకటస్వామి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలి: సీఎండీ

వెంకటస్వామి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలి: సీఎండీ


హన్మకొండ న్యూస్ :   వెంకటస్వామి పార్లమెంటేరియన్‌గా మాత్రమే కాకుండా, తన రాజకీయ జీవితంలోనూ కార్మికుల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారని టీజీ  ఎన్పీడీసియల్ సిఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి పేర్కొన్నారు. వెంకటస్వామి 97వ  జయంతి సందర్భంగా సోమవారం  హన్మకొండ, నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన  కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సీఎండీ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ కాకా కార్మికుల సమస్యలను తెలుసుకుని, వారి హక్కుల కోసం పోరాడుతూ, వారి జీవితాల్లో మెరుగైన మార్పు తీసుకురావడానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.వెంకటస్వామి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఉద్యోగుల సంక్షేమంతో పాటు సంస్థ పనితీరును మెరుగుపరచడం కూడా సమాన ప్రాధాన్యతతో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి అధికారిపై ఉందని పేర్కొన్నారు. ఓ అండ్ యం ఉద్యోగుల అవసరాలను అర్థం చేసుకుని, వారి కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మానవీయ దృక్పథంతో వ్యవహరించినప్పుడే వారిలో సంస్థ పట్ల ఆత్మీయత, బాధ్యత, స్వంత సంస్థ అనే భావన మరింత బలపడుతుందని పేర్కొన్నారు.ప్రజలు, కార్మికుల కోసం దశాబ్దాల పాటు చేసిన సేవలను స్ఫూర్తిగా తీసుకుని, అధికారులు తమ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమం, అవసరాలను గుర్తిస్తూ వారికి అవసరమైన సహకారం అందించాలని సూచించారు. అదే సమయంలో ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు సంక్షేమం,సమర్థత మధ్య సమతుల్యతను పాటిస్తూ బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి. మధుసూదన్, సి. ప్రభాకర్,  సీవీవో బోనాల కిషన్ , చీఫ్ ఇంజనీర్లు కె . వెంకట రమణ,  మల్లిఖార్జున్, సురేందర్,  మల్లికార్జున్, సీజియంలు: చరణ్ దాస్, కిషన్ ,  వేణుబాబు, కంపెనీ సెక్రటరీ కె .వెంకటేశం, జీఎంలు హేమంత్ కుమార్,  కళాధర్  రెడ్డి,  అనిల్ రెడ్డి,  వెంకట కృష్ణ, కృష్ణ మోహన్, జయరాజ్, వాసుదేవ్, శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
- ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బాణం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డిని గెలిపించాలి..డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, ఆదిలాబాద్ మార్కెట్...
బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం 
చిలిపిచెడ్ తహసీల్దార్ కార్యాలయం ప్రపోజల్ లో తప్పుల తడక: విచారణకు డిమాండ్
నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి..
కాకా వెంకటస్వామి సేవలు చిరస్మరణీయం
ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుస్నాబాద్ లో ఫ్రెషర్స్ డే వేడుకలు 
ఏసీబీ వలలో రంగారెడ్డి డి ఎం హెచ్ ఓ