సిద్దాపూర్‌లో ఎండిపోయిన వరి పంటను పరిశీలించిన బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెస్సార్

సిద్దాపూర్‌లో ఎండిపోయిన వరి పంటను పరిశీలించిన బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెస్సార్

నిజామాబాద్ : నేటి సత్యం ప్రతినిధి బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలం సిద్దాపూర్ గ్రామంలో సుమారుగా 200 ఎకరాల్లో వరి పంట ఎండిపోవడంతో, బీఆర్‌ఎస్ నాయకులు, నియోజకవర్గ నాయకులు మెమోరియల్ శ్రీనివాసరావు సోమవారం తండాలకు వెళ్లి  పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టంతో ఆందోళనలో ఉన్న రైతులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. రైతులకు జరిగిన నష్టాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పైడిమల్ సబ్ స్టేషన్ వద్ద రైతులకు స్వచ్ఛమైన కరెంటు ఇవ్వాలని 24 గంటల కరెంటు ఫ్రీగా ఇవ్వాలని వరి పొట్ట దశలో ఉందని వారికి నీళ్ళు అవసరమని వ్యవసాయ బోర్లకు కరెంటు కావాలి వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను తెలుసుకుని వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు గత బి ఆర్ ఎస్ హాయంలో ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసిందని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదని ఎమ్మెస్సార్ ఆరోపించారు 24 గంటల విద్యుత్ సరఫరా చేయకపోవడం తో రైతులు తమ పంటలను కాపాడుకోలేకపోతున్నారని అన్నారు సిద్ధపూర్ రిజర్వాయర్ పనులు తమ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే పూర్తి అయ్యేదని రైతులకు ఇలాంటి కన్నీళ్లు మిగిలేవి కావని ఆయన అన్నారు ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రాయితులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఆయన వెంట మాజీ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంజిరెడ్డి స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.

Views: 13

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
- ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బాణం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డిని గెలిపించాలి..డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, ఆదిలాబాద్ మార్కెట్...
బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం 
చిలిపిచెడ్ తహసీల్దార్ కార్యాలయం ప్రపోజల్ లో తప్పుల తడక: విచారణకు డిమాండ్
నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి..
కాకా వెంకటస్వామి సేవలు చిరస్మరణీయం
ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుస్నాబాద్ లో ఫ్రెషర్స్ డే వేడుకలు 
ఏసీబీ వలలో రంగారెడ్డి డి ఎం హెచ్ ఓ