వార్డు మెంబర్లకు కనీస గౌరవం దక్కడం లేదు

వార్డు మెంబర్లకు కనీస గౌరవం దక్కడం లేదు

గజ్వేల్ మండల వార్డు మెంబర్ల ఫోరమ్ నాయకులు

 

సిద్దిపేట జిల్లా/గజ్వేల్ :  తెలంగాణ రాష్ట్ర వార్డ్ మెంబర్ ఫోరమ్ వ్యవస్థాపక అధ్యక్షులు నాగబెల్లి జ్యోతి మహేష్ ఆదేశానుసారం, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ముక్క అనిల్, కుకునూరుపల్లి మండల అధ్యక్షులు దేవి నరసింహులు ఆధ్వర్యంలో గజ్వేల్ మండల వార్డు మెంబర్ల ఫోరమ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గజ్వేల్ మండల నూతన కార్యవర్గం అధ్యక్షులు జూపల్లి తిరుపతి, ఉపాధ్యక్షులు చిట్యాల ఎల్లం, చేర్యాల కర్ణాకర్, నిమ్మ స్వామి, పాండవుల కృష్ణ, ప్రధాన కార్యదర్శులు పాండవుల వెంకటేష్, బీడ శివకుమార్, కార్యదర్శులు మంతూరి కరుణాకర్, కోరమైన స్వామి, కార్యవర్గ సభ్యులు గంగల్ల కృష్ణ లు ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామాల్లో వార్డు మెంబర్లకు కనీస గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వార్డులోని ప్రజల సమస్యలను పరిష్కరించలేని పరిస్థితి నెలకొందని, పంచాయతీల్లో పెత్తనమంతా సర్పంచ్‌ల చేతిలోనే ఉంటోందని విమర్శించారు. వార్డు మెంబర్ల హక్కుల సాధనకు, ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఫోరమ్ ఆధ్వర్యంలో కలిసికట్టుగా పోరాడతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
- ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బాణం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డిని గెలిపించాలి..డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, ఆదిలాబాద్ మార్కెట్...
బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం 
చిలిపిచెడ్ తహసీల్దార్ కార్యాలయం ప్రపోజల్ లో తప్పుల తడక: విచారణకు డిమాండ్
నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి..
కాకా వెంకటస్వామి సేవలు చిరస్మరణీయం
ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుస్నాబాద్ లో ఫ్రెషర్స్ డే వేడుకలు 
ఏసీబీ వలలో రంగారెడ్డి డి ఎం హెచ్ ఓ