గజ్వేల్‌లో ఘనంగా తైక్వాండో కలర్ బెల్ట్ టెస్ట్
సిద్దిపేట జిల్లా/గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో సిద్దిపేట జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘తైక్వాండో కలర్ బెల్ట్ టెస్ట్’ కార్యక్రమం ఘనంగానిర్వహించబడింది. జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి/బ్లాక్ బెల్ట్ మాస్టర్ స్వామి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ చందన రవీందర్, సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధి సంతోష్ కుమార్ గుప్తా, జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్మన్ దేశబోయిని నర్సింలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ చందన రవీందర్ మాట్లాడుతూ నేటి సమాజంలో పిల్లలకు ఆత్మరక్షణ విద్యలు ఎంతో అవసరమని, మార్షల్ ఆర్ట్స్ వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం పెరుగుతుందని తెలిపారు. క్రీడల్లో రాణించే విద్యార్థులకు మున్సిపాలిటీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తైక్వాండో క్రమశిక్షణ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని, జిల్లా నుండి జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే తమ లక్ష్యమని అసోసియేషన్ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సెల్ఫ్ డిఫెన్స్, కరాటే విన్యాసాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కలర్ బెల్ట్ టెస్ట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా సర్టిఫికెట్లు, బెల్టులు అందజేశారు. ఈ సర్టిఫికెట్లు విద్యార్థుల ఉన్నత చదువులకు, క్రీడా భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయని మాస్టర్ స్వామి తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


