మున్సిపల్ చైర్ పర్సన్ అర్ధరాత్రి ఎం సి హెచ్, జిల్లా ఆసుపత్రిల ఆకస్మిక తనిఖీ.
-ఆసుపత్రిలో వైద్య సేవలపై అరా తీసిన చైర్పర్సన్.
తాండూరు : తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి అర్ధరాత్రి పట్టణంలోని జిల్లా ఆసుపత్రి, హైదరాబాద్ రోడ్డు మార్గం లోని ఎం సి హెచ్ ఆసుపత్రిలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అక్కడి వైద్యులు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా చైర్ అసుపత్రి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, వైద్యం కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. అదేవిధంగా వైద్య సిబ్బంది విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని, వైద్యం కోసం వచ్చే ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారికి అవసరమైన వైద్య సేవలను సకాలంలో అందించాలని వైద్యులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం, మెరుగైన సౌకర్యాలు అందేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని చైర్‌పర్సన్ సూచించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


