వ్యవసాయ గోదాము కోసం స్థల పరిశీలన.
నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు మక్తల్ నియోజక వర్గ కేంద్ర శివారులో వ్యవసాయ గోదాము కోసం స్థల పరిశీలన చేసినట్లు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్కురి రవికుమార్ తెలిపారు. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న రెండు గోదాముల కోసం సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో అనువైన స్థలాన్ని పరిశీలించామని, అతి త్వరలో మంత్రిగారి సమక్షంలో గోదాముల పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. రైతులందరికీ అందుబాటులో ఉండే విధంగా పెద్ద ఎత్తున గోదాముల కోసం మంత్రి వాకిటి శ్రీహరి గారు మక్తల్ శివారులో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు.అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగం డి ఈ రాజు, ఏ ఈ రామాంజనేయులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గాయత్రి అనిల్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


