నేను కూడా జీవన్ రెడ్డిలా తిరగబడితే:చిన్నారెడ్డి
వనపర్తి: వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు మాజీ మంత్రి, ప్రస్తుత ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ పైన, వనపర్తి ఎమ్మెల్యే పైన ఘాటైన వాక్యాలు చేశారు. వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి హిస్టారీతిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నేను కూడా జీవన్ రెడ్డిలా తిరగబడితే, ఎలా ఉంటుందో చూపించాలా అన్నారు.కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకుల అసంతృప్తి పర్వం వ్యక్తం చేస్తున్నారు.వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నాడనీ ఆరోపించారు.సోనియా గాంధీ నాకు టికెట్ ఇచ్చి, డబ్బులు లేకపోతే మీరే ఖర్చు పెట్టుకుని గెలిపించాలని రేవంత్ రెడ్డికి చెప్పిందన్నారు. కానీ డబ్బులకు ఆశపడి మేఘారెడ్డి వద్ద డబ్బులు తీసుకుని రేవంత్ రెడ్డి అతనికే టికెట్ ఇచ్చాడనీ ఆరోపించారు.నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎందుకు ఆగిపోయాయని మంత్రులను కలిసి అడిగితే, మీ ఎమ్మెల్యే మేఘారెడ్డి పనులకు అడ్డుపడుతున్నాడని, కాంట్రాక్టులు తన మనుషులకు రాలేదని, పనులు ఆపుతున్నాడని, కాంట్రాక్టులు రద్దు చేయాలని చెప్పాడని వారు తెలిపారన్నారు.మేఘారెడ్డి నా అనుచరులను కూడా ఇబ్బంది పెడుతున్నాడు, పరిస్థితి ఇలాగే కొనసాగితే జీవన్ రెడ్డి లాగా నేనుకూడా పార్టీపై తిరగబడాల్సి వస్తుందన్నారు.కానీ నేను పార్టీ వదిలి వెళ్లను, మేఘారెడ్డి లాంటి తప్పుడు గాళ్లను పార్టీ నుంచి తరిమేస్తాన్నారు.
Views: 101
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
18 Aug 2026 17:01:56
ఓదెల : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి భాస్కర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం బోనస్ ప్రకటించిన 7...
