శివంపేటలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని రైతుల వినతి

ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్‌కు వినతిపత్రం అందజేశారు.

శివంపేటలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని రైతుల వినతి

చౌటకూర్ :సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 207లో రైతుల నకబాటను కాపాడటం తో పాటు, మంజీరా నది పరివాహక ఎఫ్‌టీఎల్  పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ రైతులు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్‌కు వినతిపత్రం అందజేశారు.రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇదే అంశంపై గతంలో ఆగస్టు 7న సంబంధిత అధికారులకు ప్రత్యక్షంగా, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నీటిపారుదల (ఇరిగేషన్) శాఖ అధికారులు ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.సర్వే నంబర్ 207 గుండా వెళ్లే నకబాటను కాపాడి రైతులకు న్యాయం చేయాలని, ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అలాగే సదరు సర్వే నంబర్ ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వస్తుందో లేదో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, హద్దులు నిర్ణయించి అక్రమ నిర్మాణాలు, నాళాల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఇచ్చిన ఫిర్యాదుపై త్వరితగతిన విచారణ జరిపి, ఇరిగేషన్ శాఖ అధికారులు వెంటనే పరిశీలన చేసి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు.
Views: 53

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్ కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్
కరీంనగర్,  : నక్సల్స్ కార్యకలాపాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడిలో విశేష సేవలు అందించిన కరీంనగర్ రూరల్ సీఐ అనుముల నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్...
పక్కాగా 22-ఏ జాబితా రూపకల్పన
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై కాంగ్రెస్ కుట్ర
యూసుఫ్ పేటలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు 
పరకాల పాలిటెక్నిక్ ఎదుట ఎస్ఎఫ్ఐ ధర్నా
శివంపేటలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని రైతుల వినతి
5వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు