వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో నేర సమీక్షా సమావేశం
On
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన నేరాలు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, నిందితుల అరెస్టులు, సాక్ష్యాధారాల సేకరణ, కోర్టు కేసుల పురోగతిపై గురువారం కమిషనరేట్ కార్యాలయంలో డీసీపీలు, ఏసీపీలు, ఇతర పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, పరారీలో ఉన్న నిందితులను ప్రత్యేక బృందాలు, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించారు. కేసుల దర్యాప్తులో భౌతిక, సాంకేతిక, ఫోరెన్సిక్ ఆధారాలను శాస్త్రీయ పద్ధతిలో సేకరించి, నాణ్యతతో పాటు వేగవంతంగా దర్యాప్తు పూర్తి చేయాలని సూచించారు.
మహిళలు, చిన్నారులపై నేరాలు, ఆస్తి నేరాలు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
త్వరలో ప్రారంభం కానున్న గణేష్ నవరాత్రుల సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, గణేష్ మండపాల నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ ముమ్మర పెట్రోలింగ్ నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మాదకద్రవ్యాల నియంత్రణలో ప్రతిభ కనబరిచిన డ్రగ్ కంట్రోల్ అధికారులు, సిబ్బందిని అభినందించి రివార్డులు అందజేశారు.
సమావేశంలో డీసీపీలు అంకిత్ కుమార్, దారా కవిత, రాజమహేంద్ర నాయక్, కిషన్ సింగ్, అదనపు డీసీపీలు ప్రభాకర్ రావు, బాలస్వామి, సురేష్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Views: 0
About The Author

Tags:

Error on ReusableComponentWidget
Latest News
11 Sep 2026 17:53:55
ఇంటర్ విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు...
జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి : కే. రవీందర్రెడ్డి
