లక్ష్యమే దిశ.. ప్రణాళికే విజయానికి మార్గం
- ఇంటర్ విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు...
- జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి : కే. రవీందర్‌రెడ్డి
హుస్నాబాద్: ఇంటర్మీడియట్ దశ విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా చదివితే విజయాలు సాధించవచ్చని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కే. రవీందర్‌రెడ్డి అన్నారు.ఈ సందర్బంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థినులకు ఫ్రెషర్స్ డే సందర్భంగా స్వాగత కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ వి.లలిత అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రవీందర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.అనంతరం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల విద్యార్థినులు కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదవాలని, మొబైల్ ఫోన్లను విద్యాభివృద్ధికి మాత్రమే వినియోగించాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరంలోనూ రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.ప్రిన్సిపల్ వి. లలిత మాట్లాడుతూ విద్యార్థినులు క్రమశిక్షణతో చదివి పోటీ పరీక్షల్లో రాణించాలని, ఏఐ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.గత విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను అభినందించి నగదు పారితోషికాలు అందజేశారు. హెచ్‌ఈసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని తూర్పాటి వైష్ణవి 978 మార్కులు, ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ విద్యార్థిని కటోజ్ వసుమిత్ర 442 మార్కులు, బైపీసీ విద్యార్థిని మగుటం సంగీత 432 మార్కులు సాధించారు. వీరికి ప్రిన్సిపల్ వి. లలిత, హిస్టరీ అధ్యాపకుడు ఏ. సంపత్ నగదు పారితోషికాలు అందజేశారు. అనంతరం విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జానపద గీతాలకు చేసిన నృత్యాలు అలరించాయి.ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్‌ఎస్ బాలికల, బాలుర హెచ్ఎం లు జి. మహేందర్, వాసుదేవరెడ్డి, అధ్యాపకులు డి. రవీందర్, ఎస్. సదానందం, టి. నిర్మలాదేవి, బి. లక్ష్మయ్య, డి. కర్ణాకర్, ఏ. సంపత్, ఎస్. కవిత, కే. స్వరూప, జి. కవిత, ఆస్మా పిర్దోస్, ఓ. రాణి, అధ్యాపకేతర సిబ్బంది కే. గీతాంజలి, ఎస్. రాములు, టి. రమాదేవి, విద్యార్థినులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


