మట్టి వినాయకులనే పూజించాలి
మంచిర్యాల : వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ప్రతి ఒక్కరు మట్టి గణపతులను పూజించాలని, మట్టి గణపతులను ప్రోత్సహించాలని శుక్రవారం మంచిర్యాల జిల్లా కుమ్మర సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ని కలిసి తెలియజేశారు. అదేవిదంగా మట్టి గణపతి ప్రతిమలను కుమ్మర సంఘం తరఫున వారికి అందించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఉచితంగా మట్టి వినాయకులను పంచుతామని వారు హామీ ఇచ్చారన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంగాధరి తిరుపతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు నాంపల్లి శ్రీనివాస్, జిల్లా నాయకులు శనిగారపు తిరుపతి, గంగాధరి గంగన్న, కొడిమ్యాల ధర్మయ్య, సర్జన లింగమూర్తి, కటికనపల్లి సంతోష్, వేనంకి సంపత్, తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


