ఆసుపత్రిలో బీజేవైఎం కార్యకర్త కు రామచందర్‌రావు పరామర్శ 

 ఆసుపత్రిలో బీజేవైఎం కార్యకర్త కు రామచందర్‌రావు పరామర్శ 

హైదరాబాద్: విద్యార్థుల పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ నిరసనలో గాయపడిన బీజేవైఎం కార్యకర్త రాజశేఖర్‌ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు పరామర్శించారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి వెళ్లిన ఆయన రాజశేఖర్‌ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల కోసం రాజశేఖర్ ధైర్యంగా నిలబడి వారి గొంతుకగా పోరాడారని రామచందర్‌రావు అన్నారు. నిరసన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు, యువత సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం రాజశేఖర్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని రామచందర్‌రావు ఆకాంక్షించారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

#Draft: Add Your Title #Draft: Add Your Title
చేగుంట : చేగుంట ఉత్తమ ఉపాధ్యాయులు గా  ఎన్నికైనటువంటి వారిని ఘనంగా సన్మానించిన ఎంపీడీవో  చిన్నారెడ్డి, ఎంఈఓ నీరజ ,  ఎంపీడీవో చిన్నారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి...
లెంకలపల్లి మౌనిక మృతి కేసులో సంచలనం
బీసీల జనాభా లెక్క తేల్చాల్సిందే..
లెప్రసీ రహిత సమాజం కోసం సమష్టి కృషి
జలసాధన సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలి.
లక్ష్యమే దిశ.. ప్రణాళికే విజయానికి మార్గం
సీఎం ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా