పంచాయతీలకు నిధుల బదలాయింపుపై కాంగ్రెస్ శ్రేణుల హర్షం
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకం
మల్లంపల్లి,: గ్రామ పంచాయతీలకు నిధుల బదలాయింపుపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంపై మల్లంపల్లి మండల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మల్లంపల్లి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంచాయతీరాజ్, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించారు. మల్లంపల్లి సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ల్యాడా శ్యామ్‌రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెరుకుపల్లి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పంచాయతీలకు నిధులు నేరుగా వాటి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గ్రామాల అభివృద్ధికి మరింత దోహదపడుతుందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. పంచాయతీలకు వచ్చే ఆదాయాన్ని స్థానిక అవసరాలు, అభివృద్ధి పనులకు వినియోగించుకునే అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు తదితర సమస్యల పరిష్కారానికి నిధులు అందుబాటులో ఉండటం ఎంతో కీలకమని వారు తెలిపారు. పంచాయతీలకు నిధుల కొరత లేకుండా అభివృద్ధి పనులు వేగవంతం చేసేలా ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. “గ్రామాల అభివృద్ధే ప్రజా పాలన లక్ష్యం.. పల్లెల ప్రగతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మెడికల్ అండ్ హెల్త్ వింగ్ అధ్యక్షుడు ఆనందపు రవిబాబు, ఆత్మ చైర్మన్ కొండం రవీందర్ రెడ్డి, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ చిట్టిరెడ్డి రాంరెడ్డి, సర్పంచులు సలుగుల సంతోష్, రమణారెడ్డి, పసుల కార్తీక్, స్థానిక ఉపసర్పంచ్ అంకం సురేష్, గ్రామ పార్టీ అధ్యక్షులు పొనుగోటి రవీందర్, పత్తిపాక కుమారస్వామి, ముజాల కుమార్ స్వామి, వనమా శ్రీనివాస్, గొర్రె కుమార్, చందా రాము, కొంగరి నరేందర్, జింక వేణు, దయ్యాల చంద్రమౌళి, చిన్నబోయిన మహేందర్, అయిత బద్రి, మంద కుమార్, కావటి కుమార్, ల్యాడా లక్ష్మణ్, మోసిన్, రాజేశ్వరరావు, షాపూర్ సుధాకర్, పర్వత శ్రీను, గుండ రాజు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

