పార్లమెంటు పనితీరును ప్రతిబింబించేలా మాక్ పార్లమెంట్
- ఈ మాక్ పార్లమెంట్ నిర్వహించడం ద్వారా విద్యార్థులకు రాజకీయాలపై అవగాహన పెరుగుతుంది
- మండల విద్యాధికారి అని శెట్టి సుధాకర్, రాజాపూర్ గ్రామ సర్పంచ్ కావాలి రామకృష్ణ
రాజాపూర్ : భారతదేశంలో చట్టాలు రూపొందించి వాటిని ఎలా అమలు చేస్తారు అనే విషయాన్ని రాజాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కండ్లకు కట్టినట్లు ప్రజలకు చూపించారు. ప్రజాస్వామ్య దేశంలో చట్టాలు ఎలా రూపొందుతాయి, చర్చలు ఎలా జరుగుతాయ, సభ ఏ విధంగా నడుస్తుందో ప్రాక్టికల్ గా అర్థం చేసుకోవడానికి రాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మాక్ పార్లమెంట్ నిర్వహించారు.విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు, రాజకీయాలపై విద్యార్థుల కు అవగాహన పెంపొందించేందుకు ఈ మాక్ పార్లమెంట్ కార్యక్రమం దోహదపడుతుందని రాజాపూర్ మండల విద్యాశాఖాధికారి అనిశెట్టి సుధాకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజాపూర్ సర్పంచ్ కావలి రామకృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సయ్యద్ ఇబ్రహీం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


