14 నుంచి 16 వరకు సామాజిక చైతన్య నాటకోత్సవాలు

 14 నుంచి 16 వరకు సామాజిక చైతన్య నాటకోత్సవాలు

భూపాలపల్లి ,భూపాలపల్లి : భూపాలపల్లిలో సింగరేణి ఆధ్వర్యంలో ఆగస్టు14 నుంచి 16 వరకు సామాజిక చైతన్య నాటకోత్సవాలు  ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి. సామాజిక చైతన్యం, సమానత్వం, మానవతా విలువలు మరియు మహనీయుల ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో మూడు రోజుల సామాజిక చైతన్య నాటకోత్సవాలను నిర్వహించనున్నట్లు ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ నాటకోత్సవాలు ఆగస్టు 14 నుంచి 16 వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు, భూపాలపల్లి కృష్ణ కాలనీలోని C.E.R. క్లబ్ మినీ ఫంక్షన్ హాల్‌లో ఈ నాటకోత్సవావాలు నిర్వహించబడుతాయని తెలిపారు .ఆగస్టు 14న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జీవితం, ఆశయాలు, లక్ష్యాలను ప్రతిబింబించేలా“శరణం శరణం గచ్ఛామి”నాటకాన్ని ప్రదర్శించనున్నారు. ఆగస్టు 15న మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల జీవిత పోరాటం, సామాజిక సంస్కరణలు మరియు సమానత్వ సందేశాన్ని తెలియజేసే “సత్యశోధన” నాటకాన్ని ప్రదర్శించనున్నారు. ఆగస్టు 16న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ఆ లోచనా ప్రస్థానం, బౌద్ధ తత్వం వైపు ఆయన ప్రయాణాన్ని ప్రతిబిం బించే “బుద్ధునితో నా ప్రయాణం” నాటకాన్ని ప్రదర్శించనున్నారు. ఈ మూడు రోజుల నాటకోత్సవాల ద్వారా మహనీయుల జీవి తాలు, వారి సామాజిక ఉద్యమాలు, సమాజ అభ్యున్నతికి వారు చేసిన కృషి గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు సామాజిక సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం, మానవతా విలువలపై చైతన్యం కల్పించడమే ప్రధాన ఉద్దేశమని జియం  తెలిపారు ఈ కార్యక్రమాలకు ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, యువత, విద్యార్థులు, స్థానిక ప్రజలు ,సేవ సమితి సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై నాటక ప్రదర్శనలను విజయవంతం చేయాలని జియం  కోరారు. 
Views: 12

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News