ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి
- మాజీ ఎమ్మెల్యే కే ఎస్ రత్నం
- హైతాబాద్‌లో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ
షాబాద్,(రంగారెడ్డి): హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బుధవారం హైతాబాద్ గ్రామంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కే ఎస్. రత్నం పాల్గొన్నారు.రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, శ్రీశైలం, తిరంగా ర్యాలీ అసెంబ్లీ ఇంచార్జ్ నందకిషోర్ పాల్గొని విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలకు ప్రోత్సాహం అందించారు.దేశభక్తి నినాదాలతో విద్యార్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండా గొప్పత నాన్ని చాటారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి భావాన్ని చాటాలని నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేవైఎం కార్యవర్గ సభ్యులు కూతురు మహేందర్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు లింగాల మహేందర్, మాజీ మండల అధ్యక్షులు కిరణ్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి దాదే హరీష్, కృష్ణాచారి శక్తి కేంద్రం ఇంచార్జ్ గూడెం రమేష్, శక్తి కేంద్రం ఇంచార్జ్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు నవీన్, బూత్ అధ్యక్షులు శివారెడ్డి, బర్ల శ్రీకాంత్, మాజీ బూత్ అధ్యక్షులు యాది రెడ్డి, జగదీశ్, శంకర్, శేఖర్, ఉపేంద్ర, వివేక్, ఆమరేష్, రాఘవాచారి, సురేష్, సుధా శివ తదితరులు పాల్గొన్నారు.హైతాబాద్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తిరంగా ర్యాలీని విజయవంతం చేశారు.
Views: 4
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
13 Aug 2026 18:24:32
ప్రశ్నించే గొంతే కమ్యూనిజం
దేశ భవిష్యత్తు కు అసలైన దిక్సూచి ఈ కమ్యూనిజం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ.
