ఇందిరా మహిళా శక్తి చీరలు మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక: ఎమ్మెల్యే కేఆర్  నాగరాజు

ఇందిరా మహిళా శక్తి చీరలు మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక: ఎమ్మెల్యే కేఆర్  నాగరాజు

హన్మకొండ  : ఇందిరా మహిళా శక్తి చీరలు రాష్ట్రంలోని మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  అన్నారు.బుధవారం గ్రేటర్ వరంగల్ 43వ డివిజన్లోని మహిళలకు మమునూరులోని హెచ్ ఆర్ ఎస్  గార్డెన్స్ లో ఇందిర మహిళా శక్తి చీరాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ...ప్రతి ప్రభుత్వ పథకం అమలులో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.వారి ఆర్థిక ప్రగతితో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఉద్దే శ్యంతో పథకాలకు రూపకల్పన చేస్తున్నామన్నారు.మహిళల సంక్షేమం,ఆర్థిక స్వావలంబన మరియు సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.అర్హులైన ప్రతి మహిళకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో 43వ డివిజన్ అధ్యక్షులు రాజ్ కుమార్,మాజీ కార్పొరేటర్ అరుణ విక్టర్,జిల్లా కార్యదర్శి కొమురవెల్లి యాదవ్,కార్యదర్శి ప్రకాష్,మాజీ జెడ్పిటిసి నరేందర్ రెడ్డి,సీనియర్ నాయకులు బాబురావు,అరుణ, శివకుమార్,రవీందర్,పెద్ద భాస్కర్, సుదాకర్,రమేష్ తదితరులు పాల్గొన్నారు. 
Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్ మండలంలో అభివృద్ధి పనులపై అదనపు ప్రోగ్రాం ఆఫీసర్ మధులత  చౌటకూర్ మండలంలో అభివృద్ధి పనులపై అదనపు ప్రోగ్రాం ఆఫీసర్ మధులత 
చౌటకూర్: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం కేంద్రంలో మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం రోజున వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా...
జాతీయ గ్రంథపాలకుల దినోత్సవం ఘనంగా నిర్వహణ
వరంగల్‌ జిల్లాలో డిజిటల్‌ మౌలిక వసతుల విస్తరణ పై పార్లమెంట్ లో ప్రశ్నించిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య
సీఎం సభకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి : జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
ఇందిరా మహిళా శక్తి చీరలు మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక: ఎమ్మెల్యే కేఆర్  నాగరాజు
బోర్లం గురుకులాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు  శ్రీకారం