హత్యకు కారకులైన విద్యార్థులను కఠినంగా శిక్షించాలి : ట్రస్మా

హత్యకు కారకులైన విద్యార్థులను కఠినంగా శిక్షించాలి : ట్రస్మా

స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : నల్గొండ జిల్లా, మల్లెపల్లిలోని నాగార్జున హై స్కూల్ ప్రిన్సిపల్ రూపా రెడ్డి ఇటీవల హత్యకు కారకులైన విద్యార్థులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ట్రస్మా డివిజన్ కమిటీ డిమాండ్ చేశారు. శుక్రవారం మున్సిపల్ కేంద్రంలోని శివునిపల్లి లయోలా హై స్కూల్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రూపా రెడ్డి హత్యను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు ఉబ్బని మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షుడు పెసరు సంజీవరెడ్డి, ట్రెజరర్ బెన్నీ జార్జ్ లు మాట్లాడుతూ ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠినమైన చట్టాలను తీసుకురావాలని కోరారు. తల్లిదండ్రులు పిల్లలను గారాబం చేస్తూ సరిగ్గా పట్టించుకోకపోవడం వలన చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారని అన్నారు. భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులను ఈ విధంగా అతి కిరాతకంగా హత్య చేయడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. విచ్చలవిడిగా మాదకద్రవ్యాల అమ్మకాలు కొనసాగకుండా ప్రభుత్వం కట్టడి చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో జిల్లా మాజీ కోశాధికారి ఎలబోయిన కొండయ్య, పాలకుర్తి శ్రీధర్, బిట్ల శివతేజ, మండల శంకర్, డొమి జోసెఫ్, పిట్టల రాజు, దేవరాజుల రాము, ఎడ్ల స్పర్జన్ తదితరులు పాల్గొన్నారు. 
Views: 105

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి: కడియం శ్రీహరి బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి: కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్‌పూర్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు....
గజ్వేల్‌లో వైభవంగా లక్ష్మణ్ జన్మదిన వేడుకలు
రైతులకు స్ప్రింక్లర్ పైపులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
అనధికారిక నూనె మిల్లు సీజ్
హత్యకు కారకులైన విద్యార్థులను కఠినంగా శిక్షించాలి : ట్రస్మా
శ్రీ సంతోషిమాత ఆలయంలో శ్రీ వరలక్ష్మీ వ్రత ప్రత్యేక పూజలు
ఎల్ నీనో ప్రభావంతో ప్రస్తుత పంటల పరిస్థితి ఫై రైతులకు అవగాహన