బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి: కడియం శ్రీహరి

బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి: కడియం శ్రీహరి

స్టేషన్ ఘన్‌పూర్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శుకరవారం జఫర్గడ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కొత్త డిజిటల్ రేషన్ కార్డుల పంపిణి చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. రెండు రోజుల క్రితం ఎక్కడో ఆదిలాబాద్ లో సంజీవ రెడ్డి అనే వ్యక్తికి ఇతర కాంగ్రెస్ నాయకులకు గొడవ జరిగితే అది కడియం శ్రీహరిపైనే జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం చేశారని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తో కాంగ్రెస్ ప్రభుత్వంపై సబ్జెక్ట్ లేని వార్తలతో విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా స్వామ్య వ్యవస్థలో ఇది సరైన పద్ధతి కాదని సూచించారు. తెలంగాణ రాష్ట్రం చేపట్టిన సన్న బియ్యం పంపిణి కార్యక్రమం ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13వేల 800కోట్ల ఖర్చుతో కోటి 06లక్షల రేషన్ కార్డుల ద్వారా 3కోట్ల 10లక్షల మందికి ఒక్కరికి 6కిలోల చొప్పున ఉచిత సన్న బియ్యం పంపిణి చెస్తున్నట్లు తెలిపారు. అత్యున్నత భద్రతా ప్రమాణాలతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా డిజిటల్ రేషన్ కార్డులను పంపిణి చేస్తుందని అన్నారు. పేద ప్రజలు, రైతులు, మహిళల పక్షాన నిలబడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, తహసీల్దార్, ఎంపిడివో, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
 
 
Views: 119

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి: కడియం శ్రీహరి బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి: కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్‌పూర్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు....
గజ్వేల్‌లో వైభవంగా లక్ష్మణ్ జన్మదిన వేడుకలు
రైతులకు స్ప్రింక్లర్ పైపులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
అనధికారిక నూనె మిల్లు సీజ్
హత్యకు కారకులైన విద్యార్థులను కఠినంగా శిక్షించాలి : ట్రస్మా
శ్రీ సంతోషిమాత ఆలయంలో శ్రీ వరలక్ష్మీ వ్రత ప్రత్యేక పూజలు
ఎల్ నీనో ప్రభావంతో ప్రస్తుత పంటల పరిస్థితి ఫై రైతులకు అవగాహన