ఐదో రోజు సీపీఐ పోరు యాత్ర
మందమర్రి, (మంచిర్యాల) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల జీవితాలను సంక్షోభంలోకి నెట్టిందని సీపీఐ మండల కార్యదర్శి వనం సత్యనారాయణ అన్నారు. సోమవారం స్థానిక బీజోన్ సెంటర్లో బిజెపి పాలనకు వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో ఐదో రోజు పోరు యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆగస్టు 6 నుంచి ప్రారంభమైన దేశవ్యాప్త పాదయాత్ర ద్వారా ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం అవుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్,సుదర్శన్,పౌలు,వెంకటస్వామి,దుర్గరాజ్,గోపి,మొండి,సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
Views: 10
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
10 Aug 2026 17:45:40
మల్యాల, :జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో పెయింటింగ్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా యూనియన్ నూతన అధ్యక్షుడిగా బట్టు రమేష్...
