అధిక ధరలు రైతు, కార్మిక, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని సిపిఐ సిపిఎం ధర్నా.
- కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లు రద్దు చేసుకొని ,పదిలక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి .
- (సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు చింతకింది కుమారస్వామి డిమాండ్).
వరంగల్/ నల్లబెల్లి : ప్రధాన మంత్రికి తహసిల్దార్ ద్వారా మెమోరాండం. దేశంలో నానాటికి పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కల్తీ లేని విత్తనాలు కాంప్లెక్స్ ఎరువులు అందించాలని, కరువు ప్రాంతాల్లో రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఐ సిపిఎం నాయకులు చింతకింది కుమారస్వామి కడియాల మనోహర్ లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఉభయ కమ్యూనిస్టు పార్టీల మండల కమిటీల ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో కుమారస్వామి మాట్లాడుతూ రైతు ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలని, 35శాతమే పంటలు కొంటామనీ కేంద్రం చెప్పడం రైతు వ్యతిరేక విధానాలను అమలు చేయడమే అవుతుందన్నారు.వందశాతం పంటలు కొనుగోలు చేయాలనీ పంట నిల్వలకు సరిపడా గోదాములు నిర్మించాలని డిమాండ్ చేశారు.దశాబ్దాల తరబడి కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను హరిస్తూ నాలుగు లేబర్ కోడ్ లను తీసుకురావడానికి వెంటనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంపగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేబర్ కోడ్ లను అమలు చేస్తామనీ చెప్పడం కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరూ కార్మిక వ్యతిరేకులేననీ తేలిపోయిందన్నారు.తక్షణమే లేబర్ కోడ్ లను ఉపసంహరించుకోవాలని, కార్మిక సంక్షేమం అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు.ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ నెరవేర్చకపోగా నేటికీ ఖాళీగా ఉన్న పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకపోవడమంటే నిరుద్యోగ యువతకు వెన్నుపోటు పొందడమే అన్నారు.ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నల్లబెల్లి మండల తహసిల్దార్ ద్వారా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకీ మెమోరాండం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం మండల నాయకులు బొడిగె సమ్మయ్య, మామిళ్ల పెద్ద ఐలయ్య, కడియాల క్రాంతి కుమార్, ఇస్లావత్ రవి,ఆవాల సంపత్రావు, గట్టి పాపయ్య, మర్రి రమేష్బొ,డిగె నారాయణస్వామి, దిండు బాబు, కనకం సాగర్, కత్తి సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
11 Aug 2026 16:20:25
శివంపేట, (మెదక్): మెదక్ జిల్లా శివంపేట మండలం చిన్న గొట్టిముకుల గ్రామానికి చెందిన నారాయణ గారి పార్వతమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న శివంపేట మండల...
