తలసేమియా చిన్నారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచింది: మంత్రి పొంగులేటి..

తలసేమియా చిన్నారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచింది: మంత్రి పొంగులేటి..

  • తలసేమియా బాధిత కుటుంబాలకు భరోసా.
  • ప్రతి చిన్నారి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.

హనుమకొండ : తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు, వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  అన్నారు. తలసేమియా బాధిత చిన్నారులకు రక్తం అందించడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. హనుమకొండలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తలసేమియా బాధిత చిన్నారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభకు ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి పొంగులేటి గారు.ఈ సందర్భంగా తలసేమియా బాధిత చిన్నారులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి ప్రస్తావించారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్నది చిన్నారులు మాత్రమే కాదని, వారి కుటుంబ సభ్యులు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తలసేమియా బాధితుల కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హనుమకొండలో ఏర్పాటు చేసిన కౌంటర్ ద్వారా ఇప్పటికే సుమారు 235 మంది దరఖాస్తు చేసుకున్నారని, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 వేల మందికి పైగా ఈ సహాయం అందే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు.వికలాంగుల కోటాకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని తెలిపారు.తలసేమియా చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని మంత్రి మనస్ఫూర్తిగా స్వాగతించారు. గతంలో అనేకసార్లు దరఖాస్తులు చేసినప్పటికీ పరిష్కారం కాని సమస్యలకు ప్రస్తుత ప్రభుత్వం పరిష్కారం చూపుతోందని పేర్కొన్నారు. రక్తం ఎక్కడ పడితే అక్కడ డబ్బులు చెల్లించి కొనుగోలు చేయలేమని మంత్రి అన్నారు. రక్తదానం చేస్తున్న ప్రతి దాతను రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని తెలిపారు. రక్తదాతలు ముందుకు వచ్చి తలసేమియా చిన్నారుల ప్రాణాలను కాపాడుతున్నారని కొనియాడారు. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు ప్రభుత్వం భవిష్యత్తులోనూ అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. అవసరమైన కుటుంబాలకు ఇళ్ల సౌకర్యం కల్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తామని తెలిపారు. ప్రభుత్వ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని, అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ పథకాల ద్వారా ఇళ్లు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నా రు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట శాసనసభ్యులు  కేఆర్ నాగరాజు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు, తలసేమియా బాధిత చిన్నారుల తల్లిదండ్రులు, రక్తదాతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాపన్నపేట మండల అధ్యక్షుడిగా జిన్నగోపాల్ మోర్చా నియామకం పాపన్నపేట మండల అధ్యక్షుడిగా జిన్నగోపాల్ మోర్చా నియామకం
పాపన్నపేట ; పాపన్నపేట మండల అధ్యక్షుడిగా జిన్నగోపాల్ కిషన్ మోర్చా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. మండలంలో పార్టీ బలోపేతానికి...
అన్యాక్రాంతమైన భూములను కాపాడండి.
చౌటకూర్ నుంచి పోసానిపల్లెలో గ్రామంలోని వెళ్తున్న రోడ్డు పక్కన ఉన్న చెట్లను యథేచ్ఛగా చెట్ల నరికివేత
పెండెల రవీందర్‌ను పరామర్శించిన చల్లా..
ఘనంగా ఆదివాసీ దినోత్సవం 
నూలస్వప్న గారి పుట్టినరోజు సందర్భంగా ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం 
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం