పొక్సో కేసులో నిందుతుడికి 04 సంవత్సరాల జైలు శిక్ష,2000/- రు.జరిమానా.

పొక్సో కేసులో నిందుతుడికి 04 సంవత్సరాల జైలు శిక్ష,2000/- రు.జరిమానా.

  • శిక్ష పడటంలో కృషి చేసిన అధికారులను,
  • పీపీ లను, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ. మహేష్ బి.గితే

గంభీరావుపేట, రాజన్న సిరిసిల్ల : గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికల పట్ల ఆసభ్యకరంగ  ప్రవర్తించిన (పోక్సో) కేసులో నిందుతుడీకి 04 సంవత్సరాలు  జైలు శిక్ష మరియు 2000/-రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ శుక్రవారం   రోజున తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పాఠశాల ప్రాంగణంలో గోడా  ధూకి బాలికలతో ఏగదండి రాజేందర్ అనే వ్యక్తి ఆసభ్యకరంగ ప్రవర్తించగా , పాఠశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదు  మెరకు గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి అప్పటి గంభీరావుపేట ఎస్.ఐ మహేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం నిందితుడిని రిమాండ్ కి తరలించడాం జరిగింది.అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా కోర్టు విచారణలో భాగంగా కోర్టు మానిటరింగ్ ఎస్‌.ఐ లు రవీందర్ నాయుడు, శ్రవణ్ యాదవ్ ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్,కోర్టు మానిటరింగ్  కానిస్టేబుల్  నవీన్, పొక్సో కోర్టు కానిస్టేబుల్ వెన్నెల కోర్టులో 10మంది సాక్షులను ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాన్సీ  వాదించగా,శాస్త్రీయ ఆధారాలు,సాక్షులను పరిశీలించిన న్యాయమూర్తి నేరము రుజువు కావడంతో నిందితుడైన అగదండి రాజేందర్ కు O4 సంవత్సరాలు జైలు శిక్ష మరియు 2000/-జరిమాన విధించారు.ఈకేసులో పకడ్బందీగా దర్యాప్తు చేపట్టి నిందితునికి శిక్ష పడటంలో కృషి చేసిన అప్పటి ఎస్ఐ మహేష్, ప్రస్తుత డిఎస్పీ నాగేంద్రచారి , పబ్లిక్ ప్రాసిక్యూటర్ ,జాన్సీ,ఎల్లారెడ్డిపేట్ సర్కిల్ సి.ఐ ఓ.వెంకటేష్ గంభీరావుపేట ఎస్.ఐ శ్రీకాంత్,కోర్టు మానిటరిoగ్ ఎస్‌.ఐలు రవీందర్ నాయుడు,శ్రవణ్ యాదవ్ ,కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్, సి ఎం ఎస్ కానిస్టేబుల్  నవీన్, పొక్సో కోర్టు కానిస్టేబుల్ వెన్నెల లను ,లీగల్ సపోర్ట్ పర్సన్ లహరిక లను జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే అభినందిచారు.
Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

ఎల్ నీనో ప్రభావం ప్రత్యామ్నాయ పంటల ఫై అవగాహన ఎల్ నీనో ప్రభావం ప్రత్యామ్నాయ పంటల ఫై అవగాహన
నాంపల్లి : మండలంలోని మహమ్మదాపురం, మల్లపురాజుపల్లి గ్రామాలలో శుక్రవారం ఎల్ నినో ప్రభావం మరియు ప్రస్తుత పంటల పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటల గురించి వ్యవసాయ విస్తరణ అధికారిణి...
బాయమ్మపల్లి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ఇసుక దందాను పక్కదారి పట్టించేందుకే నా తండ్రి మరణాన్ని వాడుకుంటున్నారు : రమేష్ రెడ్డి.
నూతన తహసీల్దార్, రిజిస్ట్రార్ కార్యాలయ భవనాలకు శంకుస్థాపన
ఎస్‌ఐఆర్‌ నోటీసుల పంపిణీపై అధికారులకు శిక్షణ
పిచ్చిమొక్కలతో నిండిన పాలిటెక్నిక్ కళాశాల ఆవరణ
22A నిషేధిత భూముల జాబితా లో అక్రమాలు,