చేపల చెరువు అక్రమ కాలువల వార్తకు స్పందన

-చేపల చెరువు అక్రమ కాలువలను పూడ్చివేస్తున్న ఇరిగేషన్ అధికారులు. 

చేపల చెరువు అక్రమ కాలువల వార్తకు స్పందన

 

 

 

సంగారెడ్డి : చేపల చెరువు కోసం అక్రమంగా వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కి  నీళ్ళతరలింపు కాల్వలు తవ్వకం అనే శీర్షిక వార్త  విజన్ ఆంధ్ర వార్త పత్రికలో  వరుస కథనాలు ప్రచురణ కాగా గ్రామ ప్రజలు యువకులు పేపర్ క్లిప్పు తో గురువారం జిల్లా కలెక్టర్ ప్రతిక్  జైన్ కు వినతిపత్రంలో కాలువలను పూడ్చాలని అక్రమ నీటిని అరికట్టాలని విన్నపత్రం అందించారు. దీనికి స్పందించిన జిల్లా కలెక్టర్  ఇరిగేషన్ ఎస్సి కి ఫోన్ చేసి పూర్తి నివేదిక అందించాలని తెలపడంతో ఇరిగేషన్ డి ఈ రవికుమార్ వర్క్ ఇన్స్పెక్టర్  నాగరాజ్ కలిసి అధికారులు చెరువు అక్రమ నీటి కాలువలను పరిశీలించారు. శనివారం ఉదయం  చెరువు దగ్గరికి వెళ్లి తవ్విన నీటి కాలువను రెండు  జెసిబి తో పూడ్చివేత పనులు చేపట్టారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ కసాన్ పల్లి పెద్ద చెరువు నుంచి తీసిన కాల్వలను కలెక్టర్ చొరవ తీసుకొని అక్రమార్కులపై చర్య తీసుకోవడం సంతోషకరమని వారు పేర్కొన్నారు. అక్రమంగా మోటర్లు పెట్టి నీటిని తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు యువజన సంఘ నాయకులు ప్రభుత్వం డిమాండ్ చేశారు. అక్రమ చేపల చెరువు కోసం నీటిని తరలించేందుకు అక్రమంగా విద్యుత్ వినియోగించినందున విద్యుత్ అక్రమ వాడకాన్ని గుర్తించి శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు

eft

Views: 72

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి: కడియం శ్రీహరి బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి: కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్‌పూర్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు....
గజ్వేల్‌లో వైభవంగా లక్ష్మణ్ జన్మదిన వేడుకలు
రైతులకు స్ప్రింక్లర్ పైపులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
అనధికారిక నూనె మిల్లు సీజ్
హత్యకు కారకులైన విద్యార్థులను కఠినంగా శిక్షించాలి : ట్రస్మా
శ్రీ సంతోషిమాత ఆలయంలో శ్రీ వరలక్ష్మీ వ్రత ప్రత్యేక పూజలు
ఎల్ నీనో ప్రభావంతో ప్రస్తుత పంటల పరిస్థితి ఫై రైతులకు అవగాహన