జీవో 97ను తక్షణమే ఉపసంహరించుకోవాలి.
--పాలిటెక్నిక్ విద్యను గతంలో మాదిరిగానే టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలో కొనసాగించాలి.
--పాలిటెక్నిక్ విద్య పేద మధ్య తరగతి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలకు మార్గం.
--పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలకు సంపూర్ణ మద్దతు.
–జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి.
తాండూరు : తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును అయోమయం లోకి నెట్టేలా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97ను తక్షణమే ఉపసంహరించుకోవాలని జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలను గతంలో మాదిరిగానే టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలోనే కొనసాగించాలని కోరారు. పాలిటెక్నిక్ విద్య పేద, మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్యతో పాటు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలకు బలమైన మార్గం అని అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యారంగ నిపుణులతో సరైన చర్చలు జరపకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు.విద్యాశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకనైనా విద్యార్థుల ఆందోళనలను గుర్తించి, విద్యావేత్తలు మరియు నిపుణుల సలహాలు తీసుకుని జీవో 97ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
జీవో 97ను తక్షణమే ఉపసంహరించుకోక పోతే పాలిటెక్నిక్ విద్యార్థులు చేపట్టే ప్రతి ప్రజాస్వామ్య ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని, విద్యార్థుల భవిష్యత్తు కోసం వారితో కలిసి ఉద్యమిస్తామని రాజ్ కుమార్ కందుకూరి స్పష్టం చేశారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Aug 2026 18:45:12
నాంపల్లి : మండలంలోని మహమ్మదాపురం, మల్లపురాజుపల్లి గ్రామాలలో శుక్రవారం ఎల్ నినో ప్రభావం మరియు ప్రస్తుత పంటల పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటల గురించి వ్యవసాయ విస్తరణ అధికారిణి...
