చౌటకూర్‌లో గణనాథులకు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు

చౌటకూర్‌లో గణనాథులకు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు

-మాజీ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి

చౌటకూర్, : చౌటకూర్ మండల కేంద్రంలో వినాయక నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాథుల విగ్రహాలకు సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.వివిధ యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమా ల్లో మాజీ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి పాల్గొని, గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి అర్చనలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం నిర్వాహకులు, యువతతో కలిసి పూజా కార్యక్రమా లను కొనసాగించారు. వినాయక నవరాత్రుల వేడుకలతో మండల కేంద్రంలో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమం లో విద్యాప్రసాద్, జనార్దన్ గౌడ్,శ్రీశైలం, వివిధ యువజన సంఘాల సభ్యులు, యువకులు మరియు భారీ సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News