బాధితులను పరామర్శించిన ఆర్బిఎల్ సీఈవో బుయని శ్రీనివాస్ రెడ్డి.
తాండూరు (వికారాబాద్ జిల్లా) దాయాదుల దాడిలో గాయపడిన బాధితుడిని ఆర్ బి ఎల్ సిఈ ఓ కాంగ్రెస్ పార్టీ నాయకులు భుయాని శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. శుక్రవారం యాలాల మండలం జక్కేపల్లి గ్రామంలో దయాదుల దాడిలో తీవ్రంగా గాయపడి తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంబురప్ప కుమారుడు లక్ష్మన్ ను శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన దాడి గల కారణాలను కుటుంబ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. లక్ష్మణ్ కు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. అదేవిధంగా దాడి ఘటనపై యాలాల ఎస్సై విటల్ రెడ్డికి దాడికి పాలడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎలాంటి ఆందోళన భయపడాల్సిన అవసరం లేదని తాను అండగా ఉంటానని బాధితులకు భరోసాని ఇచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రహ్లాదు కులకర్ణి, సత్యమూర్తి, అఖిల్ బాబా, తదితరులు ఉన్నారు.
Views: 108
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
01 Aug 2026 19:34:19
ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు....
