విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే నా లక్ష్యం. పోచారం
కామారెడ్డి / బాన్సువాడ : బాన్సువాడ పట్టణం లో ని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి డిజిటల్ క్లాసులను ప్రారంభిం చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా కళాశాల ఆవరణ, తరగతి గదులు, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాల ను పరిశీలించారు. ఈ సందర్భం గా పోచారం మాట్లాడుతూ. ప్రస్తుత యుగం లో సాంకేతిక పరిజ్ఞానం ప్రాముఖ్యత పెరిగిందని, డిజిటల్ క్లాసులు విద్యార్థుల అభ్యాసాన్ని సులభ తరం చేస్తాయని తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల కు నాణ్యమైన విద్య ను అందించేందుకు ఆధునిక సదుపాయాల ను అందుబాటు లోకి తీసుకువస్తోంద ని పేర్కొన్నారు. విద్యార్థుల తో మాట్లాడుతూ. విద్యే భవిష్యత్తుకు బాట వేస్తుందని, ప్రతి విద్యార్థి లక్ష్యసాధన కు కృషి చేయాలని సూచించారు. సమయపాలన, క్రమశిక్షణ, గురువుల పట్ల గౌరవం ఉంటే ఉన్నత శిఖరాల ను అధిరోహిం చవచ్చని తెలిపారు. డిజిటల్ క్లాసుల ను సద్వినియోగం చేసుకొని పాఠ్యాంశాలను లోతు గా అర్థం చేసుకోవాలని, సందేహాలను వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భం గా వెంకటాపూర్ తండాకు చెందిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం విద్యార్థి ని లక్ష్మీ మాట్లాడుతూ. గత సంవత్సరం అక్టోబర్ నెల లో హాస్టల్ నుండి కాలేజీ కి రావడాని కి ప్రయాణ ఇబ్బందులను గమనించి వెంటనే మా గురించి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసిన పోచారం కి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నత విద్య కొరకు ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాల, నర్సింగ్ కళాశాల ఇలా చెప్పుకుంటూ పోతే బాన్సువాడ పట్టణాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చిన పోచారం కి మా విద్యార్థుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం లో కాలేజీ ప్రిన్సిపాల్ సలాం, కాలేజీ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు, బోధన సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
01 Aug 2026 19:34:19
ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు....
